కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన గట్టు రమేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్ర విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందాడు. గట్టు ఎల్లయ్య గౌడ్, లక్ష్మి దంపతుల కుమారుడు రమేష్ ఆధునిక సమరూప రేడియోథెరపీ చికిత్సల్లో మోతాదు పంపిణీ లోపాల విశ్లేషణ అనే అంశంపై పరిశోధన పూర్తి చేశాడు. ఈ అధ్యయనం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి రేడియోథెరపీ విభాగానికి చెందిన డాక్టర్ కె. కృష్ణమూర్తి పర్యవేక్షణలో జరిగింది. పరిశోధనలో ఆధునిక రేడియోథెరపీ చికిత్సల్లో రేడియేషన్ మోతాదుల ఖచ్చితత్వం, లోపాల గుర్తింపు, నివారణ చర్యలు, నాణ్యత నియంత్రణ పద్ధతులపై దృష్టి సారించారు. ఈ అధ్యయనం క్యాన్సర్ చికిత్స రంగంలో ఉన్నత ప్రమాణాల అమలుకు తోడ్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఓయూ భౌతిక శాస్త్ర విభాగం అధ్యాపకులు, కిమ్స్ ఆసుపత్రి రేడియోథెరపీ బృందం అభినందనలు తెలియజేస్తూ, రమేష్ భవిష్యత్తులో వైద్య భౌతిక శాస్త్రం, రేడియోథెరపీ నాణ్యతా నియంత్రణ రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వైద్య భౌతిక శాస్త్రంలో గట్టు రమేష్ కు డాక్టరేట్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


