కాకతీయ, నూగూరు వెంకటాపురం : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన షేక్ పాషా ఆదివారం గోదావరి నదిలో గల్లంతయ్యాడు. అతడు ఓ రైతు మిర్చి తోటకు నీరు పెట్టేందుకు కూలికి వెళ్లాడు. ఈ క్రమంలోనే గోదావరి నీటిలోకి దిగి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. పాషా నీటిలో గల్లంతవడం గమనించిన రైతు స్థానికుల సహాయంతో గోదావరిలో గాలింపు చేపట్టారు. కానీ పాషా ఆచూకీ దొరకలేదు. అతడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.


