11 మంది బాలురపై లైంగిక దాడి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని సైదాబాద్ జువెనైల్ హోంలో స్టాఫ్ గార్డ్ రహమాన్‌పై మరో ముగ్గురు బాలుర లైంగిక దాడి ఫిర్యాదులు రావడంతో మొత్తం ఐదు పోక్సో కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలలుగా నిందితుడు 11 మందికి పైగా బాలలను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు హోంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకుని, బాలలతో మాట్లాడి కీలక వివరాలు సేకరించారు. విచారణలో రహమాన్ అకృత్యాలు తెలుసుకుని పోలీసులు సైతం చలించిపోతున్నారు.


