- ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ రవాణా
- ఒక్కో కూపన్ మీద పదుల ట్రిప్పుల తరలింపు
- పర్యవేక్షణ లోపంతో పెరుగుతున్న అక్రమ రవాణా
- దందాలో అధికార పార్టీ నేతలదే పైచేయి
- పక్కదారి పడుతున్న ఇందిరమ్మ పథకం ఇసుక పాలసీ
- జేబులు నింపుకుంటున్న ఇసుకాసురులు
కాకతీయ ఆదిలాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధాన అమలుపై పర్యవేక్షణ కరువవడంతో అక్రమాలకు దారిగా మారింది.పంచాయతీ కార్యదర్శులు జారీచేస్తున్న ఒక్కో కూపన్ మీద పదుల సంఖ్యలో ట్రాక్టర్ ట్రిప్పుల ఇసకను వాగుల్లోంచి అక్రమార్కులు తోడేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ట్రాక్టర్ ట్రిప్పు ధర రూ.4 నుంచి 5వేల వరకు ఉండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది చోటా మోటా లీడర్లకు ఈ దందా కల్పతరువుగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, బజార్ హత్నూర్, బోథ్, సిరికొండ,గుడిహత్నూర్, నేరడిగొండ మండలాలతో పాటు పట్టణానికి 3,500ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతితో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టపగలు ఇసుక అక్రమ రవాణాజోరుగా జరుగుతోంది. దీంతో ఇసుక వ్యాపారులకు ఇందిరమ్మ ఇళ్లు కాసులు కురిపిస్తున్నాయి. అడ్డగోలుసంపాదనకు మార్గం సుగమం చేసిన ఇందిరమ్మ ఇళ్లపథకం ఇసుకాసురుల జేబులు నింపుతోంది. అధికారులు మాత్రం పర్మిషన్ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ఇసుక రవాణా చేసేవారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ ఆశయానికే కాదులబ్ధిదారుల ఆశల కు ఇసుక వ్యాపారులు గండికొడుతున్నారనే విమర్శలున్నాయి.
పేరుకే అనుమతులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులు తీసుకొచ్చినట్రాక్టర్లకు రోజుకు 2 నుంచి 4 టిప్పుల ఇసుకకు పర్మిషన్ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తూ పర్మిషన్ ఇస్తున్నారు. కానీ, ట్రాక్టర్లయజమానులు మాత్రం ఇచ్చిన కూపన్ ను దగ్గర పెట్టుకొనినాలుగు, ఐదు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నన్నారు. ఉదయం 10 గంటల తర్వాతనే వెళ్లాలని, సాయంత్రం 5గంటల తర్వాత ఇసుక తీయరాదనే నిబంధన ఉన్నా ట్రాక్టర్ల యజమానులు ప్రతి రోజూ తెల్లవారు జాము నుంచే తరలిస్తున్నారు.
అధికారుల నిఘా కరువు..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ఇచ్చోడ, బజార్ హత్నూర్, బోథ్, సిరికొండ, గుడిహత్నూర్, నేరడిగొండ మండలాల్లో ఉన్న కాగ్నా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర గ్రామాలకు ఇసుక తరలిస్తున్నారు. ఇసుక తరలింపుపై ఫిర్యాదులు వెళ్లినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ తీసుకొని ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
దందాలో అధికార పార్టీ నాయకులే
బోథ్ నియోజకవర్గం వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుకఅక్రమ రవాణాను అధికార పార్టీ నాయకులే పెంచిపోషిస్తున్నట్లు విమర్శలున్నాయి. మార్కెట్లోఒక్కో ట్రాక్టర్ రూ. 5 వేలకు ధర పలుకుతుండడంతోఅధికార పార్టీకి చెందిన కొంత మంది బడా, చోటా మోటానాయకులంతా అక్కడ ఇసుక మాఫియా పైనే దృష్టిసారించారు. దీంతో ఈ అక్రమ ఇసుక వ్యాపారం 3 ట్రాక్టర్లు30 ట్రిప్పులుగా సాగుతోంది. పంచాయతీ కార్యదర్శులు ఇస్తున్న కూపన్లను పట్టుకొనిట్రాక్టర్ల యజమానులు పదుల సంఖ్యలో ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్కు ఒక కూ పన్ మాత్రమేపంచాయతీ కార్యదర్శులు ఇస్తున్నారు. సిబ్బంది వచ్చినతర్వాత తీసుకెళ్లే ఇసుకకు మాత్రం కూపన్లు చూపిస్తున్నారు.


