- ఉరి వేసుకుని ఐటిఐ విద్యార్థి ఆత్మహత్య
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన మోరే ఋషి (17) అనే విద్యార్థి ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రూషి జమ్మికుంట పట్టణంలో గాయత్రి ఐటిఐ కళాశాలలో ఐటీఐ సెకండియర్ చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చేతికొచ్చిన కొడుకు అకాల మరణంతో ఆ కుటుంబానికి తీరనిలోటుని మిగిల్చింది. అయితే, విద్యార్థి మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. రిషి కుటుంబ సభ్యుల రోదనలు ఇంద్రనగర్ కాలనీలో హృదయ విదారకంగా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుస్తాయని పోలీసులు తెలిపారు.


