కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీసీ సంఘాల బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక ప్రజా సంఘాలు మద్దతు తెలిపి సంపూర్ణంగా విజయవంతం చేశాయి. పట్టణంలోని దుకాణాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, ఆటోలు స్వచ్ఛందంగా మూసివేశాయి.బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సర్వాయి పాపన్న, మోకుదెబ్బ గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో జిల్లాల, మండల, గ్రామ స్థాయిలో బీసీ జేఏసీ కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్వాయి పాపన్న, గండి రంజిత్ కుమార్ గౌడ్, బొమ్మిడి గణపతి రాజ్ గౌడ్, ముంజల కుమార్ గౌడ్, జక్కే కిరణ్ గౌడ్, టంగుటూరి రాజ్ కుమార్, దాసరి రామమూర్తి గౌడ్, దబ్బేట రవీందర్, ఎర్రబెల్లి సంపత్ రావు, వాసాల రామస్వామి, రేణికుంట్ల రాజశేఖర్, దేశిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


