కాకతీయ, బయ్యారం: తెలంగాణ మార్క్ ఫెడ్ సౌజన్యంతో బయ్యారం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్ కె. ఆదినారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ మొక్కజొన్న పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర.2400 ఇస్తుందని, నాణ్యత ప్రమాణాలననుసరించి మొక్కజొన్నలను ఎండబెట్టి పూర్తిగా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పంట ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో సంఘ కార్యనిర్వాణాధికారి రేగళ్ల సురేందర్, సిబ్బంది తుడుం రాజేష్, గట్ల అనుష, రేగళ్ల గణేష్, ఉప్పరపల్లి వెంకటేష్, రైతులు సత్యం, వెంకన్న, అజయ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


