- ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి
- జిల్లా ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకన్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు. శనివారం కేసముద్రం సర్కిల్, కేసముద్రం, ఇనుగుర్తి పోలీస్ స్టేషన్‌లను ఆయన సందదర్శించారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌లలో ఎస్పీ పలు విభాగాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. సిబ్బంది విధుల, రికార్డుల నిర్వహణ, భౌతిక వసతులు, ప్రజలతో సంబంధాలపై ఎస్పీ సమీక్ష చేశారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజల పట్ల మర్యాదతో వ్యవహరించాలని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రజలను కలసి పోలీస్ సేవల పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. పోలీస్ శాఖ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, చట్టం వ్యవస్థను కాపాడడంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. ఆయన వెంట డీఎస్పీ తిరుపతి రావు, కేసముద్రం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, కేసముద్రం ఎస్‌ఐ క్రాంతికిరణ్, ఇనుగుర్తు ఎస్ఐ కరుణాకర్, సిబ్బంది ఉన్నారు.


