కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు పట్టణంలో బీసీ బంద్ సందర్భంగా శనివారం రాజకీయ పార్టీల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీసీ రిజర్వేషన్ల సాధనకు పిలుపునిచ్చిన బంద్ రాజకీయ రంగు పులుముకుంది. బంద్ సందర్భంగా ర్యాలీలో కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎదురుపడడంతో ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోడీ డౌన్ డౌన్, బీసీల హక్కులను తొక్కే ప్రభుత్వాన్ని హటావ్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో బంద్ ప్రాంగణానికి చేరుకున్న బీజేపీ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదేమీ రాజ్యం ఇది? దొంగల రాజ్యం! దోపిడి రాజ్యం! అంటూ గట్టిగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కేవలం మాటలు చెప్పి, చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోసం పిలుపునిచ్చిన బంద్‌లో రాజకీయ పార్టీలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బీసీ బంద్‌లో కాంగ్రెస్–బీజేపీ పోటాపోటీ నినాదాలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


