కాకతీయ, బయ్యారం: మండలంలో ఆదివాసి ఆరాధ్యుడైన కొమరం భీమ్ విగ్రహాల స్థాపనకు మిరియాల పెంట, కంబాలపల్లి గ్రామాలలో శనివారం తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి చీమల శివకుమార్ అధ్యక్షతన భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, మండల నాయకులు అలెం కృష్ణ, మధుకర్ రెడ్డి, చీమల గోపాల్, బొల్లి మన్సూర్, వాసవి నాగేశ్వరరావు, అల్లూరి నరేష్, గుంట కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.


