- జిల్లా పశుసంవర్ధక సహాయ సంచాలకుడు బాలకృష్ణ
కాకతీయ, దుగ్గొండి: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని వరంగల్ జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు బాలకృష్ణ సూచించారు. శనివారం దుగ్గొండి మండలం నాచినపల్లి, శివాజీనగర్, స్వామిరావుపల్లిలో గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని జేడీఏ సందర్శించారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 వరకు కొనసాగుతుందన్నారు. టీకా వేసిన పశువు చెవికి క్యూఆర్ కోడ్ పోగులు వేసి భారత్ పశుదాన్ యాప్లో వివరాలు నమోదు చేస్తామన్నారు. ప్రారంభ దశలో దూడలకు రెండునెలల వయసులోనే మొదటి టీకా వేయాలని, నెల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వాలని, తర్వాత ఏటా ఒకసారి టీకా తప్పనిసరిగా వేయిస్తే వ్యాధి నివారించవచ్చని జేడీఏ బాలకృష్ణ అన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ సర్జన్లు సోమశేఖర్, శారద, బాలాజీ, రైతులు పాల్గొన్నారు.


