రసమయి ఫాం హౌజ్ పై కాంగ్రెస్ శ్రేణుల దాడి.
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానుకొండూరూ సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై(బూతూలతో కూడుకున్న) అనుచితంగా మాట్లడిన అడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కరీంనగర్ జిల్లా లో కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే దీనికి రీ కౌంటర్ గా శుక్రవారం రోజున కవ్వంపల్లి సత్యనారాయణ మీడియా ముందు తన దైన శైలిలో రసమయి కి రీ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఇందీరా చౌక్ వద్ద రసమయి దిష్టి బొమ్మను దగ్దం చేసి రసమయి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఇదీలా ఉండగా అయితే అదే రోజున కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు కవ్వంపల్లి ఫాం హౌజ్ పై రాళ్లతో దాడి చేసిన వీడియో ఇప్పుడు అలస్యంగా వెలుగు చూసింది. కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లను విసురుతుంటే ఫాంహౌజ్ లో ఉన్న మహిళలు సార్ లేరు మీరు ఎందుకు వచ్చారు అంటూ మాట్లడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయం పై కవ్వంపల్లి ప్రధాన అనుచరుల నుండి తెలిసిన సమాచారం ఈ విధంగా ఉంది. మేము మాట్లడానికి వెళ్లాము ఇదే సమయంలో అక్కడ ఉన్న కొంత మంది మహిళలు మా పై గుడ్లతో దాడి చేయడంతో మేము ప్రతి దాడి చేయవలసి వచ్చింది అని చేపుతుండడం కొసమెరుపు.



