బీసీ జేఏసీ చైర్మన్ గా బండారి ప్రకాష్
కాకతీయ, దుగ్గొండి: బీసీ జేఏసీ మండల చైర్మన్ గా బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన బండారి ప్రకాష్ ను నియమించినట్లు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు జేఏసీ వైస్ చైర్మన్ కడారి సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొన్నాల మహిపాల్, బీసీ సంఘం జిల్లా నాయకులు డ్యాగం శివాజీ, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


