రవీంద్ర జడేజా సతీమణికి మంత్రి పదవి
రివాబా జడేకు తొలిసారి కేబినెట్‌లో బెర్త్
సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చిన భూపేంద్ర పటెల్
గుజరాత్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ..
ప్రస్తుతం మంత్రి మండలిలోని అమాత్యుల సంఖ్య 26..
కాకతీయ, నేషనల్ డెస్క్ : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటెల్ శుక్రవారం తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. కొత్తగా 19 మంది ఎమ్మెల్యేను మంత్రులుగా చేర్చుకున్నారు. ఇందులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది. రివాబా జడేకు తొలిసారి కేబినెట్‌లో బెర్త్ దక్కింది. 2019 మార్చిలో బీజేపీలో చేరిన రివాబా జడేజా.. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా ఆశ్చర్యకరంగా, రివాబా జడేజా (34)ను ఈసారి సహాయ మంత్రిగా తీసుకున్నారు. ఆమె ప్రమాణ స్వీకారానికి భర్త రవీంద్ర జడేజా, కుమార్తె నిధ్యాన హాజరయ్యారు. రవాబా తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఆమె రాజ్‌కోట్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ చేశారు. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు.
15 వేల మెజార్టీతో విజయం ..
రివాబా జడేజాకు వ్యతిరేకంగా రవీంద్ర జడేజా సోదరి నైనబా జడేజా, తండ్రి అనిరుద్ద్ సిన్హ్ జడేజా ప్రచారం చేశారు. రవీంద్ర జడేజా కుటుంబం ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు దారులుగా ఉన్నారు. అయినా వారి వ్యతిరేకతను తట్టుకుని రివాబా 15 వేల మెజార్టీతో విజయం సాధించారు. గురువారం గుజరాత్ సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన మంత్రుల నుంచి ఆరుగురు మాత్రమే తమ పదవులను నిలబెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘవి ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కొత్త మంత్రులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.


