‘క్యాట్ ఒలంపియాడ్’లో విద్యార్థుల ప్రతిభ
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు క్యాట్ ఒలంపియాడ్ పరీక్షల్లో సత్తా చాటారు. నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ ఒలంపియాడ్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలలో పరీక్షలు జరగగా 70 మంది విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ మదార్ అన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలలో నైపుణ్యం సాధించే విధంగా పాఠశాల స్థాయి నుంచే వారికి పూర్తిస్థాయి శిక్షణను అందించి పలు ఒలంపియాడ్ పోటీలకు హాజరయ్యేలా చూస్తున్నామన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం చేతన్ లు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అకాడమిక్ కోఆర్డినేటర్ జయరాజు, ప్రైమరీ- ప్రీ ప్రైమరీ జోనల్ కోఆర్డినేటర్లు పార్వతి, గౌతమి విద్యార్ధులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ కృష్ణారావు, డీన్ నరేష్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, సి బ్యాచ్ ఇంచార్జి మల్లేశం,ఒలింపియాడ్ ఇంచార్జీలు పృధ్వీ, కళ్యాణి ఉపాధ్యాయులు మురళీ, లక్మణ్, రాజేందర్, రాజేంద్రచారి, కాశీ విశ్వనాథ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీలత, ఫ్రీ ప్రైమరీ ప్రైమరీ ఇన్చార్జిలు షహనాజ్, ప్రవల్లిక, ఏవో సుధాకర్, పీఈటీ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


