- లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి
- జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మద్యం షాపుల ఏర్పాటు కోసం దరఖాస్తుదారులకు మరో రెండు రోజులే సమయముందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్ కోరారు. గురువారం కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఇన్స్పెక్టర్లు చిరంజీవి, బిక్షపతి, అశోక్ లతో కలిసి ఆయన ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎంఎల్ పాలసీ 2025- 27 అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటివరకు 343 దరఖాస్తులు వచ్చాయని, 18 వరకు గడువు ఉన్నందున ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


