- రాజ్యాంగ సవరణలేకుండా రిజర్వేషన్ల కల్పన అసాధ్యం
- బీజేపీ జిల్లా అధికారప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా గ్రామ పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయలేదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనిశ్చితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు పేరుతో కోర్టు కేసుల్లో ఎన్నికలను నెట్టివేస్తూ ప్రజా పరిపాలనను అస్తవ్యస్తం చేసిందన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా రాజకీయ లాభం కోసం ఈ డ్రామా చేస్తున్నారని అన్నారు.


