- సమన్వయంతో ముందుకు సాగాలి
- భవిష్యత్‌లో మండల కమిటీల్లోనూ ఇదే విధానం
- కరీంనగర్ జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ మానే శ్రీనివాస్
కాకతీయ, హుజురాబాద్ : గ్రామ స్థాయి మొదలు అన్ని స్థాయిల నాయకుల అభిప్రాయం తీసుకునే డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుందని కరీంనగర్ జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ మానే శ్రీనివాస్ తెలిపారు. గురువారం హుజురాబాద్‌లో ప్రతాప సాయి రెడ్డి ఫంక్షన్ హాల్ లో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, టిపీసీసీ పరిశీలకులు మ్యాడం బాలకృష్ణ హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా అబ్జర్వర్ మానే శ్రీనివాస్వి లేకరులతో మాట్లాడుతూ గతానికంటే భిన్నంగా ఈసారి జిల్లా అధ్యక్షులు ఎంపికను వార్డు, గ్రామం, మండల ,నియోజకవర్గ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులకే కాదు మండల నాయకులను కూడా ఇదే విధంగా ఎన్నుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


