- బీఆర్ఎస్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫైర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు బూడిద పాలు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని మంత్రి వెల్లడించారు. 20 నెలలుగా ట్రైబ్యునల్, కోర్టుల్లో చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామన్నారు. నదీజలాల్లో తెలంగాణకు 70 శాతం వాటాపై వాదనలు వినిపించామన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జల హక్కుల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్షల కోట్లు బూడిద పాలు చేసిందని మండిపడ్డారు.


