- బోధనేతర సిబ్బందిన నియమించాలి: టీఎస్ యూటీఎఫ్
కాకతీయ, ఆదిలాబాద్: గురుకుల పాఠశాలల సమయసారణిలో మార్పు చేయాలని టీఎస్ యూటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కిష్టన్న, వి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభ్యత్వ క్యాంపెయిన్ లో భాగంగా ఇచ్చోడ మండలంలోని గురుకులాల ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. గురుకుల పాఠశాలల ప్రారంభ సమయం 7 గంటలకు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు టాయిలెట్, స్నానం చేయడానికి కూడా అవస్థలు పడుతున్నారని, నైట్ డ్యూటీలు, టర్మ్ డ్యూటీల వల్ల గురుకుల ఉపా, ఉపాధ్యాయుల సంక్షేమం దృష్ట్యా మైనారిటీ గురుకులాలతో సమానంగా మిగిలిన గురుకుల పాఠశాలల సమయం కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభించేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉపాధ్యాయులను హాస్టల్ బాధ్యతల నుండి తప్పించి, వార్డెన్లు, వాచ్ మెన్ లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. శ్యాం సుందర్, ఇచ్చోడ మండల బాధ్యులు ఎం. రాజేందర్, ఆర్ శ్రీధర్, ఎం. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


