కాకతీయ,రాయపర్తి : రైతులు పశువులకు వివిధ రకాల వ్యాధులు సంక్రమించకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్యాధికారి శృతి అన్నారు. బుధవారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో పశువులకు టీకాలు వేయడం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో పశువులకు టీకాలు వేస్తామన్నారు. ముందస్తుగా టీకాలు వేయించి తమ పశువులు వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాలని రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, గణేష్ రైతులు పాల్గొన్నారు.


