- 18న బీసీల బంద్‌కు అన్ని సంఘాలు మద్దతివ్వాలి
- బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్
- టీజేఎస్, సీపీఎం నేతలతో బీసీ ఐకాస భేటీ
- బీసీ బందుకు మద్దతు తెలిపిన టీజేఎస్, సీపీఎం
కాకతీయ,హైదరాబాద్ సిటీబ్యూరో : రాష్ట్ర బంద్‌తో బలం చూపుదామంటూ అన్ని కుల, సానుకూల భావాలున్న పార్టీలకు బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ, అలాగే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ప్రధాన డిమాండ్ తో ఈనెల 18న రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు బీసీ బందుకు మద్దతు కోరుతూ మంగళవారం బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయ్యారు. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాల జేఏసీ పిలుపు ఇచ్చిందని ఈ బంద్ కు మద్దతు ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ లు విజ్ఞప్తి చేశారు.
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డు కోవడం చాలా బాధాకరమన్నారు, కోర్టు తీర్పులను అధిగమించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 18న తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్ కు టీజేఏస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటింస్తుందని, తాము కూడా బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటామని కోదండరాం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తో కూడా బిసి సంఘాల జేఏసీ నేతలు భేటీ అయ్యారు బీసీ బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పోరాటంనికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంఘాలు సంస్థలు సహకారం తో బంద్ ను విజయవంతం చేస్తామని, బీసీ రిజర్వేషన్లు సాధించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు. బీసీ వైస్ జేఏసీ చైర్మన్ విజీఆర్ నారగోని, కో చైర్మన్ రాజారాం యాదవ్, గుజ్జ కృష్ణ,కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాంకుర్మా, వేముల రామకృష్ణ, ఈడిగా శ్రీనివాస్ గౌడ్, బుధని సదానందం, నంద గోపాల్, పానుగంటి విజయ్ గౌడ్, వరికుప్పల మధు, శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.


