- ఏరియా సేల్స్ మేనేజర్ రాజబాబు.
కాకతీయ, మంచిర్యాల : నూజివీడు ఆద్య పత్తి విత్తనాలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని రైతులకు అధిగా దిగుబడినిచ్చి, లాభం చేకూరుస్తుందని నూజివీడు సీడ్స్ ఏరియా సేల్స్ మేనేజర్ రాజబాబు అన్నారు. గురువారం హాజీ పూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని రైతు జువ్వడి సత్యనారాయణరావు (నూజివీడు సుబిజ్ కిసాన్) వ్యవసాయ క్షేత్రంలో కంపెనీ ప్రతి నిధులు ఆద్య 1134 అనే రకం పత్తి పంటపై రైతులతో కలిసి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు రైతుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు ఆధ్య 1134 రకం పత్తి పంటను వీక్షించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం రాజబాబు మాట్లాడుతూ…. నూజివీడు కంపెనీ ఆధ్య పత్తి వంగడం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. తక్కువ పంట కాలం ఉండడంతో గులాబీ రంగు పురుగు ఉధృతి నుండి తప్పించుకుని, తొందరగా పత్తి కోతకు వచ్చి రెండో పంటకు అనుకూలంగా ఉంటుందన్నారు. అదేవిధంగా అధిక దిగుబడిని కూడా ఇస్తుందని తెలిపారు. వేసంగి పంటలో అధిక దిగుబడి నిచ్చే నూజివీడు సీడ్స్ వారి వరి వంగడాలైన పుష్కల్, సింధు, విన్నర్ మొక్కజొన్న విత్తనాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని రైతులకు వివరించారు.005


