epaper
Monday, March 2, 2026
epaper

మ‌ద్ద‌తు ధ‌ర‌పైనే ఆశ‌లు

  • దీపావళి తర్వాతే పత్తి కొనుగోళ్లు
  • ఏర్పాట్లు చేస్తున్న మార్కెట్ అధికారులు
  • జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల ఎకరాల్లో సాగు
  • వ‌ర్షాలతో 14 వేల ఎకరాల్లో పంట నష్టం
  • నష్టపోయిన పంటకు ఇప్పటికీ అంద‌ని ఆర్థికసాయం

కాక‌తీయ‌, ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాకాలం పంటలను వాతావరణం దెబ్బకొట్టింది. ముఖ్యంగా పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి ఏటా ఈ సమయానికి జిల్లాలో పత్తిపంట ఇప్పటికే ఒక దఫా తీయడం పూర్తయ్యేది. కానీ ఇప్పటికీ వర్షాలు పడుతుండడంతో మొదట వచ్చిన పత్తి కాయలు మురిగిపోయాయి. మిగిలిన కాయలు కొంత మేర పగలడంతో పత్తిని ఏరేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వాతావరణం పూర్తిస్థాయిలో అనుకూలించి ఎండలు కొడితేనే పత్తి ఏరేందుకు వీలుంటుంది. పత్తి తీత ఆలస్యం కావడంతో కొనుగోళ్లు సైతం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. దీపావళి తర్వాత అన్ని మార్కెట్ యార్డులో కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది.

దిగుబడిపై ప్రభావం

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 8.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా అత్యధికంగా 4.28 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. అయితే భారీ వర్షాలతో ఈ ఏడాది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 18 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా అందులో పత్తి పంట 14 వేల ఎకరాల్లో నష్టపోయారు. వరదల కారణంగా పంటలు కొట్టుకుపోయిఇసుక మేటలు వేయడంతోపాటు రాళ్లు తేలాయి. రెండో సారి పంట వేసుకునే వీలులేకండా పోయింది. నష్టపోయిన పంటకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క పంట ఎదిగే దశలో వర్షాలు పడటంతో పత్తి కాయలు మురిగిపోయి, పూత రాలిపోయింది. ఇలా పత్తి పంట దిగుబడులపై ప్రభావం పడింది. దీంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి క‌నిపించ‌డంలేదు. ఎకరానికి 4 క్వింటాళ్లరి పత్తి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి 1 రైతులు మద్దతు ధరపైనే ఆశలు పెట్టుకున్నారు. కాగా అధికారులు మాత్రం ఈ ఏడాది 30 లక్షల క్వింటాళ్లన దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈసారి కొత్త నిబంధనలు

ఈ సారి కొత్తగా తీసుకొస్తున్న కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్ విధానంతో రైతులకు మేలుజరుగనుంది. ఈ యాప్ ద్వారా మధ్యవర్తుల దోపిడీకి చెక్ పడనుంది. ఈ యాప్ ద్వారా నేరుగారైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ రాజర్షి షా ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్ విధానంపై వ్యవసాయ అధికారులకు అవగాహనకల్పించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్ యార్డులో కల్పించాల్సిన సదుపాయాలపై దిశానిర్దేశం చేశారు. గతంలో కొంతమంది వ్యాపారులు, దళారులు అధికారులతో కుమ్మక్కై ఇతర రైతుల పేరుతో సీసీఐకి పత్తి విక్రయించారు. దీంతో కొంత మంది అధికారులపై చర్యలుతీసుకున్నారు. రైతుల స్లాట్ బుకింగ్ ద్వారా ఇప్పుడు ఆ పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో పత్తితీత ఆలస్యమవుతోందని, ఈనెల 20 తర్వాతే పత్తికొనుగోళ్లు చేస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ గజానన్ తెలిపారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img