epaper
Saturday, November 15, 2025
epaper

దండారికి వేళాయే..

  • నేటి నుంచి ఊరూరా వేడుకలు
  • ఆట‌పాట‌ల‌తో మార్మోగిన ఆదివాసీ గూడాలు
  • అల‌రించ‌నున్న గుస్సాడీ నృత్యాలు..
  • దేవతలకు సంప్రదాయ పూజలు
  • అతిథులకు ఆహ్వానం.. విందు
  • ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల సంబురాలు

కాక‌తీయ‌, ఆదిలాబాద్ : ఆదివాసీ గూడాల్లో దండారి సంబురం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవి తల్లి మురిసిపోనుంది. యేటా ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పండుగతో దండారి ప్రారంభమవుతుంది. దీపావళికి ముందు భోగిపండుగతో ప్రారంభమై.. కొలబొడితో ముగిస్తుంది. పక్షం రోజుల పాటు సాగే ఈ వేడుక తరతరాల సంప్రదాయాన్ని కొనసాగించే అద్భుత పండుగగా నిలుస్తోంది. అడవి తల్లి ఒడిలో అంగరంగ వైభవంగా సాగే దండారి పండుగ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు.. కట్టుబొట్టుకు అద్దంప‌డుతోంది.

తుడుం మోతల చప్పుల్లు

ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా తుడుం మోతల చప్పుల్లు, గుస్సాడీ ఆటపాటలే కనువిందు చేస్తాయి. తరతరాల సంప్రదాయాన్ని తూచ తప్పకుండాపాటించే సంస్కృతి సంప్రదాయాల పుట్టినిళ్లుగా నిలుస్తూఆదివాసీ గూడాలు రారమ్మంటూ స్వాగతం పలుకుతాయి. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీల నృత్యాలతో గూడేలన్నీ మారుమోగుతాయి. ఓ వైపుకోలాటాలు, మరోవైపు గోండిపాటల నృత్యాలు, హాస్యనాటికల ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి. ఆశ్వీయుజ పౌర్ణమి అనంతరం ప్రారంభమయ్యే ఈ వేడుకలు పక్షంరోజుల పాటు అంగరంగవైభవంగా సాగుతాయి. దండారి పండుగ వేళ చేసే గుస్సాడీ నృత్యాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఈ పండుగలోఆదివాసీల కట్టుబొట్టు ఎంత అద్భుతంగా ఉంటుందో.. పండుగ వేళ చేపట్టే దీక్ష అంత కఠినంగా ఉంటుంది.

గుస్సాడీల దీక్ష మరింత కఠోరం..

దండారి వేడుకల్లో గుస్సాడీల పాత్ర కీలకమైంది. నెమలి పింఛంతో చేసిన టోపీలు, టోపికి ముందు రెండు పశువుల కొమ్ములు, మధ్యలో ఓ అద్దం, చుట్టూ అలంకరణ వస్తువులు, భుజానికి వన్యప్రాణుల తోలు, నడుము, కాళ్లకు గజ్జెలు, మెడలో రుద్రాక్షమాల వేసిన ఆదివాసీ దేవుని ప్రతిరూపమే గుస్సాడీలు. గోండి భాషలో వారిని గుస్సాడీకి బదులు ‘గురు’ అని పిలుస్తారు. భోగి పండుగతో మాలధారణ వేసిన్నప్పటి నుంచి వారు దీక్షలో కొనసాగుతారు. దీక్ష చేపట్టిన నాటి నుంచి పూర్తయ్యే వరకు స్నానాలు ఆచారించకుండా, చలిలోనూ పాదరక్షలు, అర్ధ దుస్తులు ధరించి, మంచం, కుర్చీలు, సోపాలో కాకుండా నేల పైనే కూర్చోవడం, నిద్రించడం వారి ఆచారం.

దండారిలో మరో పాత్ర పోరీలు..

దండారి ఉత్సవంలో పాల్గొనే గుస్సాడీల తర్వాత మరో కీలక పాత్ర పోరీలది(ఆడ వేషధారణలో ఉండే యువకులు). వీరు కూడా గుస్సాడీలతో చివరి రోజైన కొలబొడి వరకు దీక్షలో కొనసాగుతారు. ఏ ఊరికి వెళ్లిన, ఏ ఇంటిని సందర్శించిన ఈ పోరీలు మంగళహారతులతో అష్ట, ఐశ్వర్యాలు కలగాలని, కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలనీ దీవిస్తారు.

ఐక్యమత్యానికి నిదర్శనం.

దండారీ పండుగ అంటేనే ఐక్యమత్యానికి నిదర్శనం. ఈపండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరు నుండి మరో ఊరికి విడిదికి వెళ్లడం ఆనవాయితీ. మారు మూలగిరిజన గ్రామాల గిరిజనం దండారి పండుగ వేళ ఓ గ్రామంనుండి దండారి బృందంతో మరో గ్రామానికి బయలు దేరివెళుతారు. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మద్యసత్సంబంధాలు, భాందవ్యాలు పెరుగుతాయని చెప్తారు ఆదివాసీ పటేళ్లు. ఇలా విడిదికి వెళ్లే దండారీ బృందంకాలినడకనే ఎంచుకుంటారు.. అందులోనూ రాత్రి పూటమాత్రమే వెళ్లడం వారి ఆచారం. రాత్రంత‌లా నృత్యాలు చేస్తూ, ఎలారేలా ఆటపాటలతో.. గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి వినోదాన్ని అందిస్తారు ఈగుస్సాడీలు. తెల్లవారగానే కాలకృత్యాలు తీర్చుకునిమాన్కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రంసార్ కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అథితులకు ఘన స్వాగతం పలికి.. ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అతిధులకు వీడ్కోలు పలుకుతారు. అలా తమ గూడానికి వచ్చిన గుస్సాడీలతో ఆత్మీయ బంధం ఏర్పడి.. రెండు గూడాల మధ్య స్నేహబందం మరింత బలపడి.. తరతరాలుగా కొనసాగిస్తున్న సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడుతుందనేది వారి భావన.

కొలబొడితో వేడుకలు ముగింపు

ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుపుకున్న తర్వాత కొలబొడితో వేడుకలు ముగిస్తారు. తమ కార్యక్రమాలు, అతిథుల రాకపోకలు పూర్తి కాగానే గ్రామంలోని దండారి బృందం ఇంటింటికీ వెళ్లి దర్శనం ఇస్తారు. దీంతో ఇంటి గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచిన నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తారు. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తారు. ఇలా అన్ని ఇండ్లు పూర్తి కాగానే.. కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img