కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవీకి
రాష్ట్ర సంవిధాన్ కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి మంగళవారం దరఖాస్తు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ అబ్జర్వర్ పట్నాయక్ కు దరఖాస్తు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాసిస్, ఆవేజ్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, ప్రస్తుత వర్కింగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
డీసీసీకి ‘వెన్నం’ దరఖాస్తు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


