కాకతీయ, నర్సింహులపేట : మండలంలోని వంతడుపల గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో సుమారు 55 మంది విద్యార్థులకు పరీక్షల నిర్వహించినట్లు డాక్టర్ చందు తెలిపారు. అదేవిధంగా పిల్లలకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడంతోపాటు సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్పి అన్వేష్, సూపర్వైజర్ బీమా, ఏఎన్ఎం ప్రసన్నకుమారి, సునీత, ఆశ సరస్వతి, టీచర్లు పాల్గొన్నారు.


