- మహబూబాబాద్ పట్టణ సీఐ గట్ల మహేందర్ రెడ్డి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ పట్టణ సీఐ గట్ల మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్న ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర ఆన్లైన్ గేమ్స్, వాట్సాప్ వీడియో కాల్స్, తదితర మాధ్యమాల ద్వారా ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని అన్నారు. ఆన్ లైన్ నేరాలపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తమ పిల్లలపై ప్రతీ తల్లి తండ్రులు నిఘా ఉంచాలని, వారికి నేరాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయడంతో పాటు స్థానిక పోలీస్ వారికి ఫిర్యాదు చేయాలని అన్నారు .ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్ధినీ, విద్యార్థులు, మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ శివ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


