కాాకతీయ, స్పోర్ట్స్: స్వ దేశంలో వెస్టీండీస్ క్రికెట్ జట్టుతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ని టీమిండియా 2-0 తో గెలిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి 2027లో జరుగబోవు టెస్ట్ ఛాంపియన్ షిప్ కు మెరుగైన పాయింట్లను పొందగలిగింది అయితే తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక లో కోన సాగుతుండగా స్వల్ప పాయింట్ల తేడాతో టీమిండియా మూడవ స్థానంలో ఉన్నది. గతంలో జరిగిన రెండు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరుకున్న భారత్ ఫైనల్ మ్యాచ్ ల్లో ఓటమితో చతికిలపడింది. ఎప్పటినుండో ఈ ఐసీసీ మెగా ఈవెంట్ టీమిండియా ను ఊరిస్తూ వస్తున్నది.
యువ ఆటగాళ్లతో నిండి ఉన్న భారత జట్టు ఈ సారి ఎలాగైనా టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నది,అయితే బలహీనమైన వెస్టిండీస్ జట్టు ను ఓడించినంత సులభం కాదు ఐసీసీ లీగ్ మ్యాచ్ లు గెలవడం. టెస్ట్ ల్లో బలంగా సత్తా చాటుతున్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ లాంటి జట్ల తో పోటీపడి ఫైనల్ కు చేరుకోవడం అనేది సాధారణ విషయం కాదు, రెండు సంవత్సరాలు పాటు కొనసాగే ఈ టెస్ట్ లీగ్ ల్లో విజయ పరంపర కొనసాగడం అనేది భారత ఆటగాళ్ల సమిష్టి కృషి పై ఆధారపడి ఉన్నది. ఇక వన్డే, టీ 20 మ్యాచ్ ల్లో ఇరగదీస్తున్న టీమిండియా యువ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ ల్లో ఇట్టే తేలిపోతున్నారు.
బలమైన జట్లతో తలపడడంలో విఫలమైతున్నారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టలేకపోవడం బలహీనతగా మారింది, స్వదేశం లోని స్పిన్ వికెట్ల పైనా సైతం టీమిండియా వరల్డ్ టాప్ క్లాస్ స్పిన్నర్లు బంతి ని తిప్పి ప్రత్యర్థి బ్యాటర్ లను ఇరుకున పెట్టడంలో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అదే సమయంలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్ల ఉచ్చులో టీమిండియా బ్యాటింగ్ లైనప్ చిక్కిపోతున్నది, న్యూజీలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ లో కివిస్ స్పిన్నర్లను తట్టుకుని మన బ్యాటర్లు నిలబడలేకపోవడం 3-0తో సిరీస్ ను కోల్పోవడం అనేది కలవర పరిచే విషయం.ప్రపంచం లోనే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ప్రత్యర్థి స్పిన్నర్లను ఆడటం లో తడబడుతున్నది.
ఈ సమస్యను అధిగమిస్తే మరోసారి టీమిండియా wtc ఫైనల్ చేరుకోవడం కష్టమేంకాదు. బుమ్రా, సిరాజ్ లు పేస్ దళం నడిపిస్తే, చైనమన్ కులదీప్ యాదవ్, స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర పటేల్ లతో కూడిన స్పిన్ విభాగం పటిష్టంగా ఉన్నది, యువ బ్యాటర్ జైశ్వాల్, సీనియర్ ఆటగాడు కే ఎల్ రాహుల్ లు మంచి ఫాంలో ఉండటం భారత్ కు కలిసి వచ్చే అంశం, ఒన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ లో యంగ్ కెప్టెన్ గా శుభమన్ గిల్ సూపర్ టెక్నిక్ ప్లేయింగ్ తో పాటుగా యువ తెలుగు తేజం నితీష్ రెడ్డి లాంటి నాణ్యమైన ఆటగాళ్ల తో నిండి ఉన్న భారత్ విజయవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు.


