- అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలు ప్రారంభం
- క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది
- పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే పోటీలు
- హోంమంత్రి వంగలపూడి అనిత

అమరావతి, అక్టోబర్: ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా పోటీలు జరగటం శుభ పరిణామమన్నారు. పవర్ లిఫ్టింగ్‌తో పాటు, యోగా పోటీలను నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యోగాలో రాష్ట్రం గిన్నిస్ బుక్ సాధించిన సంగతి తెలిసిందే అన్నారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి 1011 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారని మంత్రి పేర్కొన్నారు.


