epaper
Monday, March 2, 2026
epaper

తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు

  • గతేడాది కంటే తక్కువగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు
  • సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

కాకతీయ,హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేండ్లతో పోల్చితే, ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ చికున్‌గున్యా కేసులు 361 నమోదవగా, ఈ ఏడాది జనవర్ నుంచి సెప్టెంబర్ వరకూ 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో గతేడాది 226 మలేరియా కేసులు నమోదవగా, ఈ ఏడాది 209 కేసులు మాత్రమే వచ్చాయన్నారు.

గతేడాది టైఫాయిడ్ కేసులు 10,149 నమోదవగా, ఈ ఏడాది 4600 మాత్రమే నమోదయ్యాయని అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు 2900 తక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు మంత్రికి నివేదిక అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండడం అభినందనీయమన్నారు. మొత్తంగా చూసినప్పుడు కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్‌, మరో నాలుగైదు జిల్లాల్లో స్వల్పంగా కేసులు పెరిగాయని, ఆయా జిల్లాల్లో యాంటిలార్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలన్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని, ఆయా జిల్లాల్లోని హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వాతావరణంలో వస్తున్న మార్పులు, ఆ మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు‌. వర్షాలు పడుతున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలన్నారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల బారినపడితే, ప్రభుత్వ దవాఖాన లో వైద్య సేవలను ఉపయోగించుకోవాన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img