epaper
Sunday, March 1, 2026
epaper

ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే విశాఖ సదస్సు

  • సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహకాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
  • నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహణ
  • అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు లోకేష్ ఆహ్వానం
  • ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని సీఎం నిర్ణయం

అమరావతి, అక్టోబర్ : రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను భారత ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ సన్నాహకాలపై సచివాలయంలో సోమవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఐఐ సదస్సుకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. అలాగే వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్-గ్లోబల్ సీఈవోలను ఆహ్వానించాలని నిర్దేశించారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పాలసీ థింకర్లు, అకడమిక్స్‌కు సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్సఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్‌లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని సూచించారు.

రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలి :

‘గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం త్వరలోనే కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుంది. సదస్సులో ఈ అంశాలు, రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలి. సదస్సు ఏర్పాట్లకు సమయం తక్కువ ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విశాఖలో 4వ సారి సీఐఐ సదస్సు :

సీఐఐ భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్వహించడం ఇది 4వ సారి. గతంలో 2016, 2017, 2018లో మూడు సార్లు విశాఖలోనే నిర్వహించారు. ఇప్పుడు విశాఖనే సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈసారి సీఐఐ సదస్సు ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియోఎకనామిక్ ఆర్డర్’ థీమ్‌తో మొత్తం 13 సెషన్లుగా జరగనుంది. 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13మంది కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.

ఇవీ సెషన్లు :

ట్రేడ్, జియోఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, టెక్నాజజీ-ఇన్నోవేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్-సప్లయ్ చైన్, సస్టెయినబిలిటీ-క్లీన్ ఎనర్జీ, లెవరేజింగ్ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి. అయితే ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలుదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించడంతో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలి

వీలైనంత వర్క్ ఫోర్స్ పెట్టండి, మిషనరీని తీసుకురండి రాజధాని నిర్మాణాలపై...

రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు

అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలు ప్రారంభం ...

ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ..!!

*ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్య‌వ‌స్థ‌తో సత్వర న్యాయం *మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు...

నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి..!!

కాకతీయ, అమరావతి: విశాఖలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img