- బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు. నగర పరిధి లోని ట్రాన్స్ఫర్ స్టేషన్ లలో కొనసాగుతున్న విధి నిర్వహణ ను ఐసీసీసీలో ఏర్పాటుచేసిన కెమెరాల ద్వారా పరిశీలించి సమర్థవంతంగా చేపట్టుటకు కమిషనర్ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పోతన నగర్ బాల సముద్రంలో గల ట్రాన్స్ఫర్ స్టేషన్ లకు అనుసంధానమైన కెమెరాలను ఆ ప్రాంతం లో కొనసాగుతున్న శానిటేషన్ నిర్వహణ విధానాన్ని స్క్రీన్ లపై పరిశీలించారు. ఈ సందర్భంగా చరవాణి ద్వారా సీఎం హెచ్ వో, ఈ ఈ లతో కమిషనర్ మాట్లాడుతూ రెండు ట్రాన్స్ఫర్ స్టేషన్ లలో హుక్ లోడర్ల పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. రెండు ట్రాన్స్ ఫర్ స్టేషన్ లలో ఉన్న అన్ని హుక్ లోడర్లు సమర్థవంతం గా పని చేసేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి మేనేజర్ రమేష్, ఇంచార్జ్ తేజస్వి, డిజిటల్ ఇంజనీర్ నవ్య, ఆపరేటర్లు సిబ్బంది పాల్గొన్నారు.


