- ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఇన్‌చార్జి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పరామర్శించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని యాష్కీ నివాసానికి వెళ్లారు. ఇటీవల సెక్రెటరియేట్‌లో స్వల్ప అస్వస్థతకు గురైన మధుయాష్కీతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వాకబుచేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కోర్టు తీర్పు, ప్రభుత్వ పరంగా చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.


