కాకతీయ, హనుమకొండ : భగవాన్ దాస్ 22వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరై భగవాన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భగవాన్ దాస్ వరంగల్ అభివృద్ధిలో, పేదల హక్కుల కోసం ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీ, బుద్ధభవన్ నిర్మాణం వంటి ప్రాజెక్టుల ద్వారా నగర అభివృద్ధికి చేసిన తపనను కొనియాడారు. అనంతరం క్రెడాయి ఆధ్వర్యంలో నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించగా ఇనుగాల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


