కాకతీయ, రామకృష్ణాపూర్ : గెలిచిన గుర్తింపు సంఘం కార్మికులను మాయ మాటలతో మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజు గోపాల్ అన్నారు. గెలిచి రెండేళ్లు కావస్తున్నా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆదివారం స్థానిక జయంశంకర్ చౌరస్తాలోని సిఐటియూ కార్యాలయంలో మందమర్రి ఏరియా బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికుల సమస్యలు సింగరేణి యాజమాన్యం పరిష్కరించకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడు రామగిరి రామస్వామి, శ్రీకాంత్, రాజ్ కుమార్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులను మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి: సీఐటీయూ
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


