కాకతీయ, ఖమ్మం టౌన్: ఖమ్మం వర్తక సంఘ ఎన్నికలు వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి పి.బి శ్రీరాములు ప్రకటించారు. ఆదివారం వర్తక సంఘ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముందుగాఈ సమావేశం లో ప్రధాన కార్యదర్శి,కోశాధ్యక్షులు ఎన్నికల కు సంబంధించి నివేదిక చదివి వినిపించారు. ఈ సమావేశం లో సభ్యులు అడిగిన సందేహాలకు క్లుప్తంగా వివరణ ఇచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు నవంబరు16 ఆదివారం జరుగుతాయని ఎన్నికల అధికారిగా పిబి శ్రీరాములు ప్రకటించారు. ఈ సమావేశం లో ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం, ఉపాధ్యక్షులు సోమా నరసింహారావు, సహాయ కార్యదర్శి మన్నెం కృష్ణయ్య, కోశాధ్యక్షుడు తల్లాడ రమేష్ , మాజీ అధ్యక్షుడు కొప్పు నరేష్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి గొడవర్తి శ్రీనివాసరావు, సెంట్రల్ ఈసీ సభ్యులు కైలాసపు వేణుగోపాలరావు, పాయల నాగేశ్వరరావు, నేరేళ్ల శేషగిరిరావు, విడాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


