- కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రానికి చెందిన గండి సీతారాములు తల్లి గండి సుభద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలు సుభద్రమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పీఏసీఎస్ చైర్మన్ బిక్షం రెడ్డి, బోసు ,వెంకన్న మన్యు ,బోడ శీను, ఎడ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


