- వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
కాకతీయ, నల్ల బెల్లి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలంగా పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొందుతుందని వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండల అధ్యక్షుడు తడుక వినయ్ ఆధ్వర్యంలో రంగాపురం ఎంపీటీసీ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ
ప్రతి స్థానంలో పార్టీ తరఫున పోటీ చేసి విజయాన్ని సాధించడమే లక్ష్యం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడపగడపకు చేర్చాలని, కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎండగట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.
చెల్లని జీవో తెచ్చి బీసీల పేరుతో కాంగ్రెస్ రాజకీయ నాటకం ఆడిందని ఆరోపించారు. హైకోర్టు స్టే విధించడం ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనమని, ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అన్యాయం జరగనివ్వబోమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున బీసీలకు విస్తృత అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పృద్వి, వనపర్తి మల్లయ్య, బచ్చు వెంకటేశ్వర్‌రావు, వల్లే పర్వతాలు, ఈర్ల నాగరాజు, గుగులోతు తిరుపతి, గుర్రపు నరేష్, మర్రి నాగరాజు, మురికి మనోహర్, ఓరుగంటి రాజు, ములుక రాజేష్, నాగిరెడ్డి రాజిరెడ్డి, కౌడగాని రాజేందర్, తిమ్మాపురం శివ, జంగిలి పద్మ, బల్ల రాజు, చెట్టుపెల్లి విజేందర్, కంచె రవి, భూక్య రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


