కాకతీయ, నడికూడ : నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో ఆదివారం రాయపర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్య ఆదేశాల మేరకు బస్టాండ్ ఆవరణలో పోలియో చుక్కల వేశారు. ఈ మేరకు ఏఎన్ ఎమ్ కుమ్మరి రేణుక, పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి తండ్రులందరూ బాధ్యతగా తీసుకుని ఐదు ఏళ్ల వయస్సు లోపు ఉన్న పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. పోలియో వ్యాధికి టీకా తప్పా మరొక పరిష్కారం లేదని హెచ్చరించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వహించకుండా తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని ఆమె సూచించారు. రాలేని పరిస్థితి లో ఎవరైనా ఉంటే సోమ, మంగళవారాలు ఇంటింటికీ తిరిగి టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాలు తౌటం లక్ష్మి, సరిత, తదితరులు పాల్గొన్నారు.


