- వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, గీసుగొండ : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు.న్యూ ఢిల్లీలోని పూసా పరిశోధన కేంద్రం నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మ నిర్భరత సాధించేందుకు నూతన మిషన్‌ను ప్రకటించారు.వ్యవసాయ, పశుసంవర్ధక,మత్స్య, ఆహార ప్రాసెసింగ్ శాఖలలో అనేక ప్రాజెక్టులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు, సహకార సంఘాలు, సాంకేతిక నిపుణులు, ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని, సాంకేతిక సూచనలను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస రావు, జిల్లా సహకార అధికారి నీరజ, బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మధు, వర్ధన్నపేట వ్యవసాయ అభివృద్ధి అధికారి నర్సింగం,గీసుగొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీఓ పాక శ్రీనివాస్, వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ పాల్గొన్నారు.


