- మంత్రి వివేక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓటు చోరీ ఆపేందుకు తమ అభిప్రాయాన్ని సంతకాల సేకరణతో తెలుపాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ కోరారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం వార్డుల వారీగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను మంత్రి వివేక్ ఆదేశించారు.


