కాకతీయ, తుంగతుర్తి : తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన గూడ వెంకన్న మే నెలలో ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అప్పటినుండి మంచానికే పరిమితమై చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కాగా వెంకన్న చికిత్సకు ఇప్పటివరకు రూ.10 లక్షలు ఖర్చుఅయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులున్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.


