- స్కూల్ మూసివేసి ప్రిన్సిపాల్ ను అరెస్టు చేయాలి
- బీజేపీ సీనియర్ నాయకుడు దేవరాజు గౌడ్
కాకతీయ, ఇనుగుర్తి : వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని ముస్కోస్ పాఠశాలలో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేయడం అత్యంత హేయమైనదని బీజేపీ సీనియర్ నాయకుడు పంజాల దేవరాజు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ మేరీని అరెస్టు చేసి స్కూల్ ను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శనివారం మాట్లాడుతూ ముస్కోస్ స్కూల్ లో 1,6,8,9 తరగతుల పిల్లలను ఓ తరగతి గది లో కూర్చోబెట్టి క్రైస్తవ మత బోధనతో పాటు ప్రార్థనలు చేయించడం దారుణమన్నారు. ప్రిన్సిపాల్ మేరీ సమక్షంలో చర్చి ఫాదర్ చిన్నపురెడ్డి స్టూడెంట్స్ కు క్రిస్టియన్ మతంపై బోధన చేయడం క్షమించరానిదన్నారు. దీనిని అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, మేధావులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


