- మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ సైట్లలో వివాహ వాగ్దానాల పేరుతో పెట్టుబడి మోసాల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. సోషల్ మీడియాలో మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫారాలను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. వివాహ వాగ్దానం చేస్తూ నమ్మకం పొందిన తరువాత, నకిలీ ఆన్లైన్ పెట్టుబడి పథకాలలో డబ్బులు పెట్టమని మాయమాటలు చెబుతారన్నారు.
అంతేగాక ఇతర వివాహ వాగ్దానాలు ఇతర నకిలీ ఆన్లైన్ పెట్టుబడి పథకాల సంబంధించినటువంటి మోసాలతో బాధితులను ప్రలోభపెడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి నమ్మకం కల్పించిన తర్వాత సైబర్ నేరగాళ్లు తమ బ్యాంకు అకౌంట్ లో నుంచి పెద్ద మొత్తంలో నగదును లూటీ చేస్తున్నారని ఎస్పీ వివరించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ముందు జాగ్రత్త పాటించాలని కోరారు. వారి వలలో చిక్కినవారి నుంచి తెలంగాణలో 7.7 కోట్ల రూపాయలు లూటీ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ముందస్తుగా సైబర్ నేరగాళ్లు నమ్మకంతో ఆన్లైన్ బెట్టింగ్ ఇతర సేవా కార్యక్రమాలు అంటూ నమ్మబలుకుతూ మోసం చేస్తారని ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.


