- పురుగుల మందు తాగిన విద్యార్థి
- చికిత్స పొందుతూ మృతి
కాకతీయ, నర్సింహులపేట: దంతాలపల్లి మండలం వాల్యాతండా గ్రామానికి చెందిన బానోత్ చరణ్ (12) తల్లిదండ్రులు హాస్టల్ కు పంపిస్తారని పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మరణించాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. చరణ్ నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజి వద్ద గల విజ్ఞాన్ హై స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు వాల్యాతండా గ్రామానికి వచ్చాడు. సెలవుల అనంతరం చరణ్ ను తండ్రి నాగు స్కూల్ కి వెళ్ళమనగా అతను వెళ్లనన్నాడు. తండ్రి తనను ఎలాగైనా హాస్టల్కు పంపిస్తాడని బాలుడు మనస్థాపం చెంది బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు తొర్రూరులోని ఓ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చరణ్ గురువారం అర్ధరాత్రి మరణించాడని నాగు ఫిర్యాదు చేశాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.రాజు చెప్పారు.


