కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ కళాశాలల్లోని సీట్లను భర్తీ చేయుటకు ఈ నెల 10 నుండి 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐ.టీ.ఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. https.//iti.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పించారని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఐదో దశలో భర్తీ చేసే సీట్లను వాక్ ఇన్ అడ్మిషన్ ద్వారా నింపుతారనితెలిపారు. కావున అభ్యర్థులందరూ అడ్మిషన్ కొరకు ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు హాజరు కాగలరని వాక్ ఇన్ అడ్మిషన్ ప్రక్రియ ఈనెల13 నుండి 17 వరకు, ఎస్.ఎస్.సి పాసైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


