- పంట పొలాలను పరిశీలించిన ఏవో
కాకతీయ, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం, పెద్దనాగారం గ్రామాలలో వరి పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సన్నాలకు బ్యాక్టీరియా తెగులు తట్టుకునే స్వభావం ఉండదని, మబ్బులతో కూడిన వాతావరణం, మోతాదుకు మించి యూరియా వాడడం, చిరుజల్లులు పడడం వలన ఆకులు చివరి నుండి ఎండుకుంటూ మొదలు వరకు వస్తుందని ఈ లక్షణాలను కనిపించినట్లయితే బ్యాక్టీరియా తెగులుగా భావించవచ్చునన్నారు. నివారణకు గాను ప్లాంటోమైసిన్ ఎకరాకు 40 గ్రాములు పిచికారీ చేయాలని, యూరియా వేయకూడదన్నారు. మడులలో మురుగునీరు బయటకు పంపించి కొత్తనీరు పెట్టుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, రైతులు అశోక్ రెడ్డి, బిక్షం తదితరులు పాల్గొన్నారు.


