కాకతీయ, సినిమా డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ప్రభాస్ షూటింగ్ ఫొటోలు లీక్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, రాబోయే సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రభాస్ మాస్ ఎనర్జీ, కామెడీ టచ్, ఫాంటసీ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం సినిమా టీమ్ యూరప్‌లోని గ్రీస్‌లో కీలక షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ముఖ్యంగా కొన్ని పాటల చిత్రీకరణ కోసం మొత్తం యూనిట్ అక్కడ శిబిరం వేసింది.
అయితే ఈ షూటింగ్ మధ్యలో కొన్ని ప్రభాస్ సీన్‌లు, స్టెప్పుల ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో నెటిజన్లలో హడావుడి మొదలైంది. లీక్ అయిన స్టిల్స్‌లో ప్రభాస్ తెల్లని ప్యాంట్, కలర్‌ఫుల్ జాకెట్, స్టైలిష్ షూస్‌తో పూర్తి ఎనర్జీగా కనిపించారు. చాలా కాలం తర్వాత ఇంత ఫ్రెష్ అండ్ ఫన్ మూడ్‌లో ప్రభాస్‌ను చూడటం ఫ్యాన్స్‌కు పండుగలా మారింది. సోషల్ మీడియాలో ఆయన లుక్ ఫోటోలు వైరల్ అవుతూ అభిమానులు #TheRajaSaab, #Prabhas హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు.
ఇక మరోవైపు, ఈ ఫోటోలు లీక్ కావడం పట్ల మూవీ మేకర్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. సినిమా సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ థియేటర్‌లో ప్రేక్షకులు అనుభవించాలనేది వారి ఉద్దేశం. లీక్‌ల వల్ల ఆ మాజిక్ తగ్గిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘ది రాజాసాబ్’లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మారుతి మాస్, కామెడీ కలగలిపే డైరెక్టర్ కావడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇదే ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరో ఫెస్టివల్ మూడ్‌ను తెచ్చిపెట్టింది. “సలార్” తరువాత ప్రభాస్ ఇంత కలర్‌ఫుల్, ఉల్లాసమైన అవతార్‌లో కనిపించబోతున్నారని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.


