- చెంజర్ల వంతెన వద్ద రోడ్డు ప్రమాదం
- కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం !

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చెంజర్ల గ్రామం చెంజర్ల వంతెన వద్ద గల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు బస్సును ఓవర్‌టేక్ చేయబోయే సమయంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయలపాలైన వ్యక్తి తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చెంజర్ల వంతెన ప్రధాన రహదారిపై వెలుతున్న బస్సును కారు ఓవర్ టెక్ చేసే క్రమంలో ఏదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాదారుడిని కారు ఢీ కోనడంతో రోడ్డు ప్రమాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు శామంతుల శ్రీనివాస్ (35) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మానుకొండూరు సీఐ తెలిపారు.


